భారత గడ్డపై న్యూజిలాండ్ మొదటిసారి టెస్ట్ సిరీస్ గెలిచింది. సొంతగడ్డపై ఎదురులేకుండా పోతున్న టీమిండియాకు ఇది పెద్ద షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు చేతులేయడంతోనే బెంగళూరు, పూణే టెస్టుల్లో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ముంబైలో మూడో టెస్టు శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. అనంతరం రోహిత్ సేన ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఈ క్రమంలో మూడో టెస్టులో మార్పులు చేయాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. రెండో టెస్టులో కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్‌కు…