నేటి నుంచి ఆరంభమయ్యే చివరిదైన రెండో టెస్టులో బంగ్లాదేశ్‌ను భారత్ ఢీకొంటుంది. కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ మైదానంలో ఉదయం 9.30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. స్వదేశంలో రికార్డు స్థాయిలో 18వ టెస్టు సిరీస్ విజయంపై కన్నేసిన టీమిండియా.. కాన్పూర్‌లోనూ బంగ్లాను చిత్తు చేయాలని చూస్తోంది. మంచి ఫామ్ మీదున్న రోహిత్ సేనను ఆపడం బంగ్లాకు పెను సవాలే. తొలి టెస్టులో దెబ్బతిన్న బంగ్లాదేశ్ పుంజుకోవాలని భావిస్తోంది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ అర్ధ శతకంతో రాణించాడు. గిల్…