Cold Intensity: తెలుగు రాష్ట్రాల్లో చలి వాతావరణం క్రమంగా పెరుగుతోంది. రాత్రివేళల్లోనే కాకుండా పగటిపూట కూడా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. మరోవైపు మరో మూడు రోజుల్లో చలి తీవ్రత మరింత పెరగనుంది.
రాష్ట్రంలో పెరుగుతున్న చలి తీవ్రత కారణంగా రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. రాష్ట్రంలోనే అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రత ఆదిలాబాద్‌లో నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.