Cold Intensity: తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న చలి తీవ్రత.. పడిపోతున్న ఉష్ణోగ్రతలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cold Intensity: తెలుగు రాష్ట్రాల్లో చలి వాతావరణం క్రమంగా పెరుగుతోంది. రాత్రివేళల్లోనే కాకుండా పగటిపూట కూడా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. మరోవైపు మరో మూడు రోజుల్లో చలి తీవ్రత మరింత పెరగనుంది. తెలంగాణ, ఏపీలో ఉష్ణోగ్రతలు మరింత పడిపోతున్నాయి. చలి విపరీతంగా ఉండడంతో ప్రజలు వణికిపోతున్నారు. పగటిపూట కూడా ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉంటాయి. గడ్డకట్టే చలితో రాష్ట్రం వణికిపోతోంది. పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో అన్ని ప్రాంతాల్లో చలి వాతావరణం నెలకొంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాలు చలితో వణుకుతున్నాయి.
Read also: Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం..
Also Read
- AP New Excise Policy: మద్యం షాపుల కేటాయింపులో కొత్త విధానం.. మంత్రి కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు
- Botsa Satyanarayana: రైతులను ఆదుకోవాలి.. పంట నష్టంపై బొత్స కీలక వ్యాఖ్యలు
- Vijayawada: పేదలకు సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్.. 24 వేలకుపైగా కుటుంబాలకు ఇళ్ల పట్టాలు
- Local Body Elections: అభివృద్ధి, సంక్షేమమే ఎజెండా.. స్థానిక ఎన్నికలపై కూటమి వ్యూహం.. మంత్రి పార్థసారధి కీలక వ్యాఖ్యలు
ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండలో 12.3 డిగ్రీలు, నిర్మల్ జిల్లా పెంబిలో 13.1 డిగ్రీలు, సిద్దిపేట జిల్లా కొండపాకలో 13.5 డిగ్రీలు, జగిత్యాల జిల్లా మల్లాపూర్‌లో 13.6 డిగ్రీలు, మంచిర్యాల జిల్లా జిన్నారంలో 13.9 డిగ్రీలు, మంచిర్యాల జిల్లా కోపాల భూషణ్‌పల్లిలో 13.9 డిగ్రీలు. జిల్లా, పెద్దపల్లి జిల్లా మంథని మండలంలో 13.9 డిగ్రీలు. 14.2 డిగ్రీలు, మెదక్ జిల్లా దామరంచలో కనిష్ట ఉష్ణోగ్రత 14.3 డిగ్రీలుగా నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో రాత్రిపూట మాత్రమే చలిగాలులు నమోదవుతుండగా.. తొలిసారి ఆదివారం పగటిపూట సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. మహబూబ్‌నగర్‌లో 27.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకాగా, 3 డిగ్రీలు తగ్గి 30.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. రానున్న రెండు రోజుల పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 11 నుంచి 15 డిగ్రీల మధ్య కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో పొగమంచు కురుస్తోంది. ప్రధాన రహదారులపై పొగమంచు కారణంగా వాహనాల రాకపోకలు నెమ్మదిగా సాగుతున్నాయి.
Read also: Gandhi Bhavan: నేడు గాంధీభవన్‌లో పీఏసీ కీలక భేటీ.. నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చ?
ఇక ఏపీ ఏపీలో కూడా చలి తీవ్రత ఎక్కువగా ఉంది. నేడు, రేపు దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఈరోజు రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలుచోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. విశాఖలోని ఏజెన్సీ గ్రామాలు వణికిపోతున్నాయి. చలి భయంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. ఇక చలి ఉత్తర భారతాన్ని భయపెడుతోంది.
తాజావార్తలు
-
CEC Impeachment: CEC జ్ఞానేష్ కుమార్‌ను తొలగించడం అంత ఈజీ కాదు.. రాజ్యాంగం ఏం చెబుతోంది.?
-
Banks Merged: ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. మరో రెండు బ్యాంకులు విలీనం..!
-
Tejasvi Surya: జీన్ జీ అయినా.. ఎవరైనా నిజాయితీ నాయకులనే కోరుకుంటారు
-
Mohan Babu: “నాని పర్మిషన్తో నన్ను పెట్టుకోవడానికి వచ్చావా? అక్కడ కొట్టింది నా ఈగో”
-
Iran-US: అమెరికాకు ఇరాన్ తాజా హెచ్చరిక.. ఈసారి చిన్న తప్పు చేసినా..!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?