టాటా కార్ల ధరలు పెరగనున్నాయి. టాటా మోటర్స్ ప్యాసింజర్ వాహన ధరలను పెంచాలని కంపెనీ నిర్ణయించింది. పెరిగిన ధరలు ఈ నెల 17 నుంచి అమల్లోకి రానున్నట్టు సోమవారం సంస్థ ప్రకటించింది. ఈవీలతోసహా అన్ని మోడల్స్, వేరియంట్ల ధరలు సగటున 0.6 శాతం పెరుగుతాయని కంపెనీ ప్రకటించింది.
బీజేపీ ఎమ్మెల్యే ఈటలకు భద్రత పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఎక్స్ కేటగిరీగా ఉన్న ఈటల భద్రతను వై ప్లస్ కేటిరీకి పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
గత ఆర్థిక సంవత్సరంలో భారతదేశం నుంచి సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు 27శాతం పెరిగాయి. ప్రధానంగా అమెరికా, చైనా, యూరోపియన్ దేశాలకు అధిక మొత్తంలో ఎక్స్ పోర్ట్స్ అయ్యాయని సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు, అభివృద్ధి సంస్థ ఛైర్మన్ డీవీ స్వామి వెల్లడించారు.
కొత్తగా వంటగ్యాస్ కనెక్షన్ తీసుకోవాలని భావిస్తున్న వారికి గ్యాస్ కంపెనీలు చేదువార్తను అందించాయి. ఎవరైనా కొత్తగా ఎల్పీజీ కనెక్షన్ తీసుకోవాలంటే సెక్యూరిటీ డిపాజిట్ తప్పనిసరిగా చెల్లించాలి. అలాగే రెగ్యులేటర్‌కు కూడా డబ్బులు చెల్లించాలి. అయితే తాజాగా గ్యాస్ సిలిండర్ డిపాజిట్ మొత్తాన్ని భారీగా పెంచేశాయి. గృహ వినియోగ 14.2 కిలోల సిలిండర్ డిపాజిట్ ధర ఇప్పటివరకు రూ.1,450 ఉండగా.. దానిని రూ.2,200కి పెంచుతున్నట్లు గ్యాస్ ఏజెన్సీలు ప్రకటించాయి. ఐదు కేజీల సిలిండర్‌పై డిపాజిట్ మొత్తాన్ని రూ.800 నుంచి…