Covid Nasal Vaccine: కోవిడ్ మహమ్మారిపై పోరులో మరో ముందడుగు పడింది. ముక్కద్వారా వేసుకునే కోవిడ్ నాసల్ వ్యాక్సిన్ ను ప్రారంభించనున్నారు. స్వదేశీ వ్యాక్సిన్ తయారీ సంస్థ భారత్ బయోటెక్ తన ఇంట్రానాసల్ కోవిడ్-19 వ్యాక్సిన్ ఇన్ కోవాక్ ని భారతదేశంలో తొలిసారిగా జనవరి 26న విడుదల చేస్తున్నట్లు కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ ఎల్లా శనివారం వెల్లడించారు.