18వ లోక్‌సభ స్పీకర్‌గా బీజేపీ ఎంపీ ఓం బిర్లా ఎన్నికయ్యారు. అయితే లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవికి సంబంధించి రాజకీయాలు హాట్ హాట్‌గా కొనసాగుతున్నాయి. డిప్యూటీ స్పీకర్ పదవిని దక్కించుకోవాలని ప్రతిపక్షాలు ఆశలు పెట్టుకున్నాయి. పలువురు కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే డిమాండ్ చేస్తున్నారు. విపక్షాలు కూడా స్పీకర్ పదవికి తమ అభ్యర్థిని నిలబెట్టాయి.