పైరసీని అరికట్టడంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ ప్రభుత్వానికి, పోలీసులకు మీడియా సమక్షంలో తెలుగు చిత్ర పరిశ్రమ ధన్యవాదాలు తెలిపింది. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి హైదరాబాద్‌లో రెండు రోజుల క్రితం అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. విదేశాల నుంచి రవి హైదరాబాద్ రాగా.. తెలంగాణ పోలీసులు అతడిని పక్కా ప్రణాళికతో పట్టుకున్నారు. రవి అరెస్ట్ నేపథ్యంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రెస్‌మీట్ నిర్వహించింది. ఈ ప్రెస్‌మీట్‌లో టాలీవుడ్ సీనియర్ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు ఆసక్తికర వ్యాఖ్యలు…
ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో తెలంగాణ పోలీసులు అతడిని అరెస్టు చేశారు. రవి చేతనే ఐబొమ్మ వెబ్‌సైట్‌ను పోలీసులు డిలీట్ చేయించారు. దాంతో సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. ఈరోజు తెలుగు ఫిలిం ఛాంబర్ మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్, నిర్మాత సి కళ్యాణ్, ఛాంబర్ సెక్రటరీ ప్రసన్నకుమార్, దర్శకుల సంఘం అధ్యక్షులు వీర శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మాత…