Medha School Drugs: మేధా స్కూల్ డ్రగ్స్ కేసులో అసలు ఏం జరుగుతోంది? సీనియర్ కెమిస్ట్రీలు తయారు చేయలేని రీతిలో మత్తు మందును ఓ స్కూల్ కరస్పాండెంట్ ఎలా తయారు చేశాడు? ప్రతినిత్యం కిలో చొప్పున మత్తుమందును తయారుచేసి కల్లు డిపోలకి సరఫరా చేస్తున్న జయప్రకాష్ గౌడ్ రిమాండ్ రిపోర్టులో ఏముంది? సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలోని మేధా స్కూల్లో ఆల్ఫ్రాజోలం తయారీ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆల్ఫ్రాజోలం తయారు చేసేందుకు మేధా స్కూల్ కరస్పాండెంట్ జయప్రకాశ్…
శంషాబాద్ లో ఒ వ్యక్తి తన ఇంట్లో ఏకంగా గంజాయి మొక్కలను పెంచాడు. పెంచిన గంజాయి విక్రయిస్తాడా? అతనే సేవిస్తాడా అనేది తెలియాల్సి ఉంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఉట్పల్లి గ్రామంలో ఒ వ్యక్తి తన ఇంట్లో రెండు గంజాయి మొక్కలు పెంచాడు.
నగరంలోని ఎల్బీనగర్ పోలీసులకు డ్రగ్ మాఫియాపై భారీ విజయం లభించింది. రాష్ట్రంలోనే తొలిసారిగా రూ.1.2 కోట్ల విలువైన 20 కిలోల హాష్ ఆయిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరాంధ్ర నుంచి గంజాయిని హాష్ ఆయిల్‌గా మార్చి, చిన్న చిన్న బాటిళ్లలో గుట్టుచప్పుడు కాకుండా సరఫరా చేస్తున్న స్మగ్లర్లు పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. గంజాయి స్మగ్లర్లు కొత్త తంత్రాన్ని ఎంచుకున్నారు. భారీగా ప్యాకెట్లు తరలించడం కష్టంగా మారడంతో హాష్ ఆయిల్ రూపంలో గంజాయిని మారుస్తున్నారు. హాష్ ఆయిల్‌కు ప్రత్యేక…