సంగారెడ్డి జిల్లా కంది మండలం ఐఐటీ హైదరాబాద్ లో మెడికల్ ఎక్విప్ మెంట్ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్. ఈ కార్యక్రమంలో ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ మూర్తి, జిల్లా కలెక్టర్,ఎస్పీ పాల్గొన్నారు. ఐఐటి హైదరాబాద్ లో జీవన్ లైట్ స్మార్ట్ మెడికల్ ఐసీయూ వెంటిలేటర్ ను ప్రారంభించారు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. ఐఐటి హైదరాబాద్ లో తయారు చేసిన జీవన్ లైట్ స్మార్ట్ మెడికల్ ఐసియు వెంటిలేటర్ ప్రారంభించడం సంతోషంగా ఉంది.…
హీరో నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో నడుస్తున్న బసవతారకం ఆస్పత్రి ఎంతో మంది క్యాన్సర్ బాధితులకు బాసటగా నిలుస్తోంది. వేల సంఖ్యలో క్యాన్సర్ బాధితులకు విశిష్ట సేవలు అందిస్తున్న బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి తాజాగా ఐఐటీ హైదరాబాద్‌తో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ రెండు సంస్థలు కలిసి కొత్తగా రేడియేషన్ ఫిజిక్స్ సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీ కోర్సును అందించనున్నాయి. ఈ మేరకు ఎంవోయూపై ఇరువర్గాలు సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం గురించి బసవతారకం ఆసుపత్రి మేనేజింగ్…