మహా కుంభమేళా ద్వారా అందరి దృష్టిని ఆకర్షించిన ఐఐటీ బాబా తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు. మళ్లీ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్స్ పై జోస్యం చెప్పాడేమో అని అనుకుంటే పొరపాటే. గంజాయితో దొరికిపోవడంతో ఐఐటీ బాబా మరోసారి సంచలనంగా మారాడు. గంజాయి కేసులో జైపూర్ పోలీసులు ఐఐటీ బాబా అభయ్ సింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆత్మహత్య చేసుకుంటానని సోషల్ మీడియాలో వెల్లడించడంతో.. పోలీసులు అతని ఆచూకీ కనిపెట్టి జైపూర్‌లోని రిద్ధి-సిద్ధి ప్రాంతంలోని ఒక హోటల్ లో…
IIT Baba: మహా కుంభమేళాలో అందరి దృష్టిని ఆకర్షించిన ‘‘ఐఐటీ బాబా’’ గురించి అందరికి తెలిసిందే. అభయ్ సింగ్ అనే ఐఐటియన్ బాబాగా మారడంపై మీడియా ప్రత్యేక కథనాలను కూడా ప్రచురించింది. ఇటీవల, ఇండియా వర్సెస్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్‌లో పాకిస్తాన్ గెలుస్తుందని జోస్యం చెప్పడంతో మరోసారి ఈ బాబా వైరల్ అయ్యారు. అయితే, ఈ మ్యాచ్‌లో భారత్ చిరకాల ప్రత్యర్థిని చిత్తుగా ఓడించడంతో, ఐఐటీ బాబాపై ట్రోల్స్ వచ్చాయి.
సోషల్ మీడియాలో ఐఐటీ బాబాకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో అతను ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ గురించి ఒక అంచనా వేశాడు. అతను భారత జట్టు ఓటమి గురించి మాట్లాడాడు. దీంతో.. టీమిండియా ఫ్యాన్సే కాకుండా.. పాకిస్తాన్ అభిమానులు కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారు.
ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో ఐఐటీ బాబా అభయ్ సింగ్ గురించి చర్చ జరుగుతోంది. మొదట ఐఐటీలో చదివి ఉద్యోగం చేసిన అభయ్ సింగ్ ఇప్పుడు బాబాగా అవతారమెత్తాడు. ఇప్పుడు అభయ్ సింగ్ ఐఐటీ బాబాగా ఇంటర్నెట్‌లో ఫేమస్ అయ్యాడు. ఆయన జీవితంతో పాటు ఆయన పలు వాదనలు కూడా చాలా చర్చనీయాంశమయ్యాయి.