Ganja Case: గంజాయి.. యువత జీవితాలను నాశనం చేస్తోంది. యూనివర్శిటీ క్యాంపస్‌లలోకి చొచ్చుకుపోయి.. స్టూడెంట్ల జీవితాలతో ఆటలాడుతోంది. నిన్నటికి నిన్న మహేంద్ర యూనివర్శిటీలో బయటపడ్డ గంజాయి.. ఇప్పుడు హైదరాబాద్‌లోని మరో ప్రతిష్టాత్మక సంస్థలోకి చొచ్చుకుపోయింది. ప్రతిష్ఠాత్మక ICFAI సంస్థలో 8 మంది విద్యార్థులు గంజాయి సేవిస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. అసలు యూనివర్శిటీల్లో ఏం జరుగుతోంది? ఇక్కడ చూడండి.. ఇది హైదరాబాద్‌లో ఉన్న ICFAI యూనివర్శిటీ. ICFAI ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ యూనివర్శిటీగా ఇది సేవలందిస్తోంది.…