అండర్ 19 మహిళల వరల్డ్ కప్ లో సత్తా చాటిన 12 మంది ఆటగాళ్లతో ఐసీసీ (ICC) టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ ను ప్రకటించింది. ఇందులో భారత్ నుంచి త్రిషతో పాటు కమలిని, ఆయుషి శుక్లా, వైష్ణవి శర్మ చోటు దక్కించుకున్నారు.
ICC U-19 Womens World Cup: మహిళల క్రికెట్లో మరో మెగా టోర్నమెంట్ కు సిద్ధమైంది. మలేసియా వేదికగా ఈరోజు ( జనవరి 18) అండర్-19 టీ20 ప్రపంచకప్ ప్రారంభం కాబోతుంది. ఈ మెగా ఈవెంట్లో మొత్తం 16 జట్లు నాలుగు గ్రూప్‌లుగా విడిపోయి పోటీ పడబోతున్నాయి.