IBM layoffs: ఆర్థిక మాంద్యం భయాలు, పలు దేశాల్లో ఆర్థిక వ్యవస్థ తిరోగమనం ఇలా పలు అంశాలు టెక్ ఇండస్ట్రీలో లేఆఫ్స్‌కి కారణమవుతున్నాయి. ఇప్పటికే ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజాలైన మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా, ఎక్స్ ఇలా పలు కంపెనీలు వేల సంఖ్యలో తమ ఉద్యోగులను తీసేశాయి. ప్రస్తుతం మార్కెట్‌లో అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ఎవరి ఉద్యోగం ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో టెక్ పరిశ్రమలో పనిచేస్తున్న ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
IBM Cuts 3,900 Jobs In Latest Tech Layoffs: ఐటీ ఉద్యోగులను కంపెనీలు భయపెడుతున్నాయి. ఎప్పుడు ఏ కంపెనీ ఉద్యోగులను తొలగిస్తుందో అని కంగారు పడుతున్నారు. ఇప్పటికే ప్రపంచస్థాయి టెక్ దిగ్గజ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఇదిలా ఉంటే ఈ జాబితాలో ప్రముఖ టెక్ దిగ్గజం ఐబీఎం కూడా చేరింది. తాజాగా 3,900 ఉద్యోగాలను తీసేస్తూ నిర్ణయం తీసుకుంది. కొన్ని అసెట్ డివెస్ట్‌మెంట్‌లలో భాగంగా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు సంస్థ బుధవారం వెల్లడించింది.…