విద్యా రంగంలో ఏపీ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా ప్రభుత్వ పాఠశాలల్లో అంతర్జాతీయ ఐబీ సిలబస్ చేర్చనుంది. రాష్ట్ర ప్రభుత్వ SCERTతో అంతర్జాతీయ విద్యా బోర్డు IB భాగస్వామ్యంతో ఏపీ ప్రభుత్వం ముందడుగు వేయనుంది. అందుకు రేపు ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ఒప్పందం జరుగనుంది. రేపు ఉదయం 10 గంటలకు అంతర్జాతీయ విద్యా బోర్డుతో రాష్ట్ర ప్రభుత్వ ఎస్‌సీఈఆర్‌టీ (SCERT) ఒప్పందం చేసుకోనుంది.