ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ విద్యారంగంలో మరో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ విద్యార్థులకు అందుబాటులోకి ఐబీ సిలబస్ ను తీసుకొచ్చింది. అంతర్జాతీయంగా ప్రభుత్వ బడి పిల్లలను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు సీఎం జగన్ మరో అడుగు ముందుకు వేశారు.