దక్షిణ కొరియా కార్ల దిగ్గజం హ్యుందాయ్ ఇండియాలో ఎలక్ట్రిక్ కార్లను ఉత్పత్తి చేసేందుకు సిద్దమయింది. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం ఇటీవల కాలంలో భారీగా పెరిగింది. పర్యావరణ ఇబ్బందులతో పాటుగా చమురు ధరలు కూడా భారీగా పెరగడంతో ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలవైపు మొగ్గుచూపుతున్నారు. హ్యుందాయ్ కంపెనీ ఇప్పటికే కోనా ఎలక్ట్రిక్ పేరిట ఓ ఎలక్ట్రిక్ వాహనాన్ని రిలీజ్ చేసింది. ఈ వాహనం ఆకట్టుకోవడంతో ఇండియాలో 4 వేల కోట్ల రూపాయలతో చెన్నై సమీపంలో ఎలక్ట్రిక్ వాహనాల ప్లాంట్‌ను నెలకొల్పేందుకు…