ఆస్ట్రేలియా చేతిలో సిరీస్ 3-1తో ఓడిపోవడంతో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. భారత మాజీలు కూడా గంభీర్‌పై మండిపడుతున్నారు. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ ఘాటుగా స్పందించాడు. గంభీర్ చేసే పనులకు.. చెప్పే మాటలకు పొంతన ఉండదన్నారు. ప్రధాన కోచ్‌గా ఉన్నపుడు భారత్‌కు చెందిన వారిని సహాయక కోచ్‌లుగా తీసుకోవచ్చు కదా? అని ప్రశ్నించారు. 2015 రంజీ ట్రోఫీ సమయంలో తనకు, గంభీర్ మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నట్లు…