సంగారెడ్డి మల్కాపూర్ చెరువులో కూల్చివేతలు హైడ్రా చేపట్టలేదని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ప్రకటన విడుదల చేశారు. ఈ కూల్చివేతలకు హైడ్రాకు ఎలాంటి సంబంధం లేదని ఆయన తెలిపారు. దీనిని హైడ్రా కు ముడిపెడుతూ సామాజిక మాధ్యమాల్లో వార్తలు రావడం విచారకరమని, హైడ్రా ఇలాంటి తప్పుడు వార్తలు ఖండిస్తోందని ఆయన అన్నారు. హైడ్రాను అప్రతిష్టపాలు చేయడానికి కొంతమంది చేస్తున్న ప్రయత్నాలను సామాజిక మాధ్యమాలు అనుసరించవద్దని విన్నవిస్తున్నామన్నారు. హైడ్రా కు సంబంధం లేని ఘటనలను ఆపాదిస్తూ సామాజిక మాధ్యమాల్లో…
ప్రజల ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు. చెరువులు, నాలాలు కాపాడడమే హైడ్రా లక్ష్యమని వెల్లడించారు. ఆర్టికల్ 21 ప్రకారం.. పరిశుభ్రమైన వాతావరణం రైట్ టూ లైఫ్ ఉద్దేశమన్నారు. హైడ్రా డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎసెట్ ప్రొటెస్ట్ ఉద్దేశ్యం.. వాటి పరిరక్షణ మా బాధ్యత అని పేర్కొన్నారు. నదులు, చెరువులు, నాలాలు ప్రజల ఆస్తులేనన్నారు. సోషల్ మీడియాలో హైడ్రాపై తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆయన తెలిపారు.