Mirai VFX : టీజీ విశ్వప్రసాద్‌కు తెలుగులో ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎన్‌ఆర్‌ఐగా తెలుగు సినిమా మీద ఆసక్తి పెంచుకున్న ఆయన, తెలుగు సినీ పరిశ్రమకు వచ్చి నిర్మాతగా 50 సినిమాలు దాదాపు పూర్తి చేశారు. అందులో కొన్ని వేరే నిర్మాణ సంస్థలతో కలిసి చేసిన సినిమాలైతే, చాలా వరకు ఆయన సొంత ప్రాజెక్ట్‌లే ఉన్నాయి. నిజానికి ఆయన సినీ పరిశ్రమలో చాలా నష్టాలు ఎదుర్కొన్నారు. అయినా, మరోపక్క ఇతర బిజినెస్‌లు చేస్తూ బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నారు.