Hyderabad: ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్‌లో పాస్ పోర్ట్ సేవా కేంద్రం ప్రారంభమైంది.. మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సేవలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశంలోనే మొట్టమొదటి సారిగా మెట్రో స్టేషన్‌లో పాస్ పోర్ట్ సేవలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు.. పాస్ పోర్ట్ ఇవ్వడంలో దేశంలోనే హైదరాబాద్ ఐదవ స్థానంలో ఉందన్నారు.. తెలంగాణలో ఇప్పటి వరకు ఐదు పాస్ పోర్ట్ సేవ కేంద్రాలు ఉన్నాయని వివరించారు.. తెలంగాణాలో రోజుకు 4500 పాస్ పోర్టులు ఇచ్చే సౌకర్యం ఉంది..