Sahasra murder case: నేరం చేయాలనే ఆలోచన వస్తే.. చేసేస్తారా? దానికి వయసుతో సంబంధం ఉండదా? కూకట్‌పల్లి సహస్ర మర్డర్ కేసులో ఇదే జరిగిందా? పక్కా మర్డర్ ప్లాన్ లేకపోయినా.. అడ్డం వస్తే అంతం చేయాలనే నిందితుని ధోరణి.. సహస్ర ప్రాణాలు బలిగొందా? అసలు సహస్ర హత్య కేసులో ఏం జరిగింది? పోలీసుల విచారణలో వెల్లడైన నిజాలేంటి? అసలు నిందితుడు దేని కోసం అత్యంత కిరాతకంగా అమ్మాయిని చంపేశాడు? మైనర్ బాలుడు క్రూరంగా చంపడం వెనుక కారణాలేంటి?…
జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఏసీబీ అధికారుల సోదాలు నిర్వహించారు. బిల్లింగ్ అనుమతికి లంచం తీసుకుంటూ అసిస్టెంట్ టౌన్ ప్లానర్ విట్టాల్ రావు పట్టుబడ్డారు. విటల్ రావును ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. విటల్ రావుకు సంబంధించిన మూడు చోట్ల దాడులు కొనసాగుతున్నాయి. రెండు బిల్డింగ్లకు ఎన్వోసీ ఇవ్వడానికి ఎనిమిది లక్షల డిమాండ్ చేసినట్లు అధికారులు గుర్తించారు.. నాలుగు లక్షలు తీసుకొని మరో నాలుగు లక్షలు డిమాండ్ చేయడంతో వెంకట్ అనే వ్యక్తి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు.
హైదరాబాద్ నగరంలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. నేడు ఖాజాగూడ భగీరథమ్మ చెరువులో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. చెరువు బఫర్ జోన్‌లోని నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. బఫర్ జోన్‌లోని 4 ఎకరాల ఖాళీ స్థలం చుట్టూ ఉన్న ఫెన్సింగ్‌ను హైడ్రా కూల్చివేసింది. ఆ స్థలంలో ఉన్న వైన్స్‌ను తక్షణమే ఖాళీ చేయాలంటూ హైడ్రా అధికారులు ఆదేశించారు. కూల్చివేతల సందర్భంగా అధికారులకు భారీ బందోబస్తు చేపట్టారు. ఇటీవల భగీరథమ్మ చెరువును హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. భగీరథమ్మ చెరువు…
DB Stock Broking Scam: హైదరాబాద్‌లో రూ. 7,000 కోట్ల విలువైన స్టాక్‌బ్రోకింగ్ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. డిబి స్టాక్ బ్రోకింగ్ కంపెనీ తమను మోసం చేసిందంటూ సైబరాబాద్ లో ఫిర్యాదులు చేశారు.