Telangana Best in India: ఈఎస్‌జీ.. అంటే.. ఎన్విరాన్‌మెంటల్(పర్యావరణ), సోషల్(సామాజిక) మరియు గవర్నెన్స్(పాలన)పై హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎంటర్‌ప్రైజెస్ అసోసియేషన్(హైసియా) శ్రద్ధ చూపటం పట్ల సీనియర్ ఐఏఎస్ అధికారి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్ హర్షం వ్యక్తం చేశారు. ఈఎస్‌జీపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించినందుకు హైసియాని ఆయన మనస్ఫూర్తిగా అభినందించారు. మనమంతా ఈఎస్‌జీపై సరైన సమయంలోనే దృష్టిపెడుతున్నామని అన్నారు.