Rave Party: టాలీవుడ్లో డ్రగ్స్ గుట్టు మరోమారు బట్టబయలైంది. హైదరాబాద్ మాదాపూర్‌లో రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. విఠల్ రావు నగర్ వైష్ణవి అపార్ట్ మెంట్లో యాంటీ నార్కొటిక్ బ్యూరో అధికారులు దాడులు నిర్వహించారు.
హైదరాబాదులో మరో సారి డ్రగ్స్ కలకలం రేపింది. డిసెంబర్ 31 వేడుకలను టార్గెట్ చేసి డ్రగ్స్ అమ్మకాలు జరిపేందుకు ప్రయత్నిస్తున్న ముఠా గుట్టును ఎస్వోటీ పోలీసులు రట్టు చేశారు. హైదరాబాద్‌లో అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాను రాచకొండ పోలీసులు పట్టుకున్నారు.
తెలంగాణలో డ్రగ్స్ కల్చర్ పెరిగిపోయింది. పబ్ లలో డ్రగ్స్ విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. ఖరీదైన డ్రగ్స్ నగరంలో ఎక్కడబడితే అక్కడ దొరుకుతున్నాయి. బంజారా హిల్స్ రాడిసన్ హోటల్ లోని ఫుడ్డింగ్ అండ్ మింక్ పబ్‌లో డ్రగ్స్ దొరికిన వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ డ్రగ్స్ పై ఫోకస్ పెట్టింది. డ్రగ్స్ ని అరికట్టేందుకు పటిష్టమయిన చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. అందులో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ మాదిరే డ్రగ్ టెస్ట్‌లు చేయాలని నిర్ణయించింది.…
రాడిసన్ బ్లూ హోటల్ లోని ఫుడ్డింగ్ అండ్ మింక్ పబ్ కి వెళ్ళిన షార్ట్ ఫిలిం ఆర్టిస్ట్ కుషిత అక్కడేం జరిగిందో ఎన్టీవీ ఫేస్ టు ఫేస్ లో వెల్లడించింది. అయితే అక్కడి విషయాలు చెబుతూనే లైవ్ లో వుండగానే కుషిత మధ్యలో లేచి వెళ్ళిపోయింది.
హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం రేపుతున్నాయి. డ్రగ్స్ కేసుల విషయంలో విద్యార్ధులు ఎక్కువగా వున్నారని, వారిపై కేసులు నమోదు చేయాలా వద్దా అనేది ఆలోచిస్తున్నామన్నారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్. ఓయో రూమ్‌ల్లో ప్రైవేట్ పార్టీలు జరుగుతున్నట్టు గుర్తించాం.. రూల్స్ పాటించకపోతే చర్యలు తీసుకుంటాం.. సీసీ కెమేరాలు ఉండాలి.. 6 నెలల స్టోరేజీ ఉండాలి.. ఓయో రూమ్ బుక్ చేసుకున్నప్పుడు ఐడీ కార్డు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు సీపీ సీవీ ఆనంద్. యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ, డిగ్రీ కాలేజీలలో…
హైదరాబాద్ ని డ్రగ్స్ మత్తు చుట్టేస్తోంది. సెలబ్రిటీలు, సినీతారలు, పారిశ్రామిక వేత్తలు, వీఐపీల సంతానం.. డ్రగ్స్ బారిన పడుతున్నారు. హైదరాబాద్ ని డ్రగ్స్ రహిత నగరంగా మారుస్తామని, అందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు సీపీ సీవీ ఆనంద్. హైదరాబాద్ లో యువత ఎక్కువగా డ్రగ్స్ వాడుతున్నారు. హైదరాబాద్ లో ఉన్న సంపన్నులు ఇతర రాష్ట్రాల నుండి డ్రగ్స్ తెప్పించుకొని వారికి తెలిసిన వాళ్ళ కు అలవాటు చేస్తున్నారన్నారు. హైదరాబాద్ కొన్ని ఇంటర్నేషనల్ స్కూళ్ళల్లో పిల్లలు కూడా డ్రగ్స్…