Drugs Case Cv Anand: సెంట్రల్ యూనివర్సిటీలో డ్రగ్స్ కలకలం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం రేపుతున్నాయి. డ్రగ్స్ కేసుల విషయంలో విద్యార్ధులు ఎక్కువగా వున్నారని, వారిపై కేసులు నమోదు చేయాలా వద్దా అనేది ఆలోచిస్తున్నామన్నారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్. ఓయో రూమ్‌ల్లో ప్రైవేట్ పార్టీలు జరుగుతున్నట్టు గుర్తించాం.. రూల్స్ పాటించకపోతే చర్యలు తీసుకుంటాం.. సీసీ కెమేరాలు ఉండాలి.. 6 నెలల స్టోరేజీ ఉండాలి.. ఓయో రూమ్ బుక్ చేసుకున్నప్పుడు ఐడీ కార్డు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు సీపీ సీవీ ఆనంద్.
యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ, డిగ్రీ కాలేజీలలో జోరుగా మత్తు ముందు విక్రయాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో గంజాయి విక్రయాలు జరుగుతున్నాయి. డార్క్ నైట్ ద్వారా డ్రగ్స్ తెప్పించుకుంటున్నారు విద్యార్థులు. డార్క్ నెట్ పైన హైదరాబాద్ పోలీస్ నిఘా ఉంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన ముగ్గురు విద్యార్థులను అరెస్ట్ చేశామన్నారు. ఇద్దరు విద్యార్థినులను కూడా అరెస్టు చేశాం..
Also Read
ప్రతిభ, అవినాష్ డిగ్రీ కాలేజ్, మల్లారెడ్డి కాలేజీలో చదువుకుంటున్న విద్యార్థుల్ని అరెస్ట్ చేశామన్నారు సీపీ సీవీ ఆనంద్. కొంతమంది సాఫ్ట్ వేర్ ఇంజనీర్ లను కూడా అరెస్టు చేశామన్నారు. సాఫ్ట్ వేర్ కంపెనీలో కీలక పోస్టులలో వున్న కొంతమందిని పట్టుకున్నాం. మూడుకేసులలో 11 మంది అరెస్ట్ చేశాం. 4.50 లక్షల రూపాయలు విలువ చేసే డ్రగ్స్, లాప్ టాప్ మొబైల్ ఫోన్లు సీజ్ చేసాం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో ఏడుగురు అరెస్ట్ కాగా, ఒకరు పరారీలో ఉన్నారు. నార్కోటిక్స్ ఎన్ఫోర్స్ మెంట్ వింగ్ ఏర్పాటు చేసిన తర్వాత పెద్ద ఎత్తున డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠా అరెస్ట్ చేశాం అని సీపీ చెప్పారు.
సాప్ట్ వేర్ ఉద్యోగులే ఎక్కువ మంది ఈ డ్రగ్స్ కేసులో వున్నారు. 11 మంది సాప్ట్ వేర్ ఉద్యోగుల ప్రమేయం వుంది. స్టూడెంట్స్ ను అరెస్ట్ చెయ్యాలా.. లేదా కౌన్సిలింగ్ ఇవ్వాలా అర్థం కాలేదు. చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అందుకే వీళ్ళని అరెస్ట్ చేసాం. టోనీ కేసులో మెయిన్ నిందితుడిపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసాం. మొన్న వ్యాపార వేత్తల అరెస్ట్ వల్ల కొంత మార్పు వచ్చింది. సాఫ్ట్ వేర్ ఉద్యోగులలో సైతం ఇప్పుడు మార్పు వస్తుందని ఆశిస్తున్నాం. కొరియర్ సంస్థలపై నిఘా ఉంటుంది. డ్రగ్స్ మహమ్మారిని హైదరాబాద్ నుంచి తరిమి కొట్టేందుకు ఎన్సీబీ వాళ్ళతో కలిసి పనిచేస్తామన్నారు.
తాజావార్తలు
-
Kavya -Anirudh Reception: కావ్య-అనిరుధ్ గ్రాండ్ రిసెప్షన్.. సీఎం విజయ్ స్పెషల్ గిఫ్ట్.. రజనీ, కమల్ ఆప్యాయపు నవ్వులు..
-
IND vs NZ Test: టీమిండియా బ్యాటర్ల ఊచకోత.. భారీ ఆధిక్యంలో భారత్..!
-
Tragedy: గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి
-
India Test Record : న్యూజిలాండ్ గడ్డపై భారత్ అరుదైన రికార్డు.. ఇదే తొలిసారి!
-
Asaduddin Owaisi: సుప్రీంకోర్టు జడ్జి అనుకుని ఒవైసీకి గౌరవ వందనం.. వివాదంలో యూపీ పోలీసులు.!
ట్రెండింగ్
-
Kimchi Day : కిమ్చీ.. కొరియా వంటకం వెనుక ఆరోగ్య రహస్యం
-
Microwave Cleaning Hacks : ఓవెన్లో మొండి మరకలా బెడదా.?.. 5 నిమిషాల ట్రిక్‌తో క్లీనింగ్ ఈజీ
-
Traditional Indian Textile Recycling : పాత చీరలతో కొత్త మ్యాజిక్.. మన అమ్మమ్మల ఫ్యాషన్ సీక్రెట్.!
-
Best Winter Destinations in India : వింటర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?.. ఈ 10 ప్రదేశాలు మిస్ కావొద్దు.!
-
Curry Leaves Pickle: కమ్మని రుచితో, నెలల తరబడి నిల్వ ఉండే ‘కరివేపాకు పచ్చడి’.. వేడి వేడి అన్నంలోకి తింటే వావ్ అనాల్సిందే..!