Telangana High Court Website Hacked: తెలంగాణ హైకోర్టు వెబ్‌సైట్ హ్యాకింగ్ కలకలం సృష్టించింది. హైకోర్టు వెబ్‌సైట్‌లో ఆర్డర్ కాపీలు డౌన్‌లోడ్ చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా సైట్‌లో అంతరాయం ఏర్పాడింది. హైకోర్టు సైట్‌లో ఏకంగా బెట్టింగ్ సైట్ ప్రత్యక్షమైంది. వెంటనే హైకోర్టు రిజిస్ట్రార్ సిబ్బంది ఈ విషయం పోలీసులకు తెలియజేశారు. Hyderabad సైబర్ అభియోగాల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.