GHMC Ward Delimitation: GHMC వార్డుల పునర్విభజన పై భారీగా అభ్యంతరాలు వచ్చాయి. ఇప్పటి వరకు 5,905 అభ్యంతరాలు రావడం గమనార్హం. నిన్న ఒక్కరోజే 1,283 అభ్యంతరాలు అధికారులు స్వీకరించారు. జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్, జోనల్, సర్కిల్ ఆఫీసుల్లో అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు. అభ్యంతరాల స్వీకరణ మరో రెండు పొడిగించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ కు హైకోర్టు ఆదేశించింది. దీంతో ఎల్లుండి వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నారు. వార్డుల విభజన శాస్త్రీయంగా జరగలేదని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.ఒక్కో వార్డులో తక్కువ జనాభా మరో…
GHMC Corporators Meeting: నేడు జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. మరో రెండున్నర నెలల్లో ముగియనుండటంతో ప్రస్తుత పాలక వర్గానికి ఇదే చివరి కౌన్సిల్ సమావేశం కానుంది! 95 ప్రశ్నలు, 45 ఎజెండా అంశాలపై సభ్యులు చర్చించనున్నారు. జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో పాటు కౌన్సిల్ మీటింగ్‌కి నగరానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. కౌన్సిల్ మీటింగ్ కోసం కార్పొరేటర్ల నుంచి అధికారులు ప్రశ్నలను స్వీకరించారు. గడిచిన ఐదేళ్లలో చేసిన పనులపై ఈ కౌన్సిల్ మీటింగ్ లో చర్చించే…
HYDRA :నగరంలోని నాలాలు చెత్తతో నిండిపోయి దుర్వాసన వెదజల్లడం సాధారణమైంది. శంకరపల్లిలోని బుల్కాపూర్ చెరువు నుంచి హుస్సేన్ సాగర్‌కు వరదనీరు చేరే నాలా పరిస్థితి కూడా ఇలాగే దారుణంగా ఉంది. ఎన్నిసార్లు శుభ్రం చేసినా, టన్నుల కొద్దీ చెత్త తిరిగి బయటపడుతోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో హైడ్రా ప్రత్యేక బృందాలు ఈ నాలాలను శుభ్రం చేయడంలో బిజీగా ఉన్నాయి. టోలీచౌక్ సమీపంలోని హకీంపేట ప్రాంతంలో రెండు రోజుల పాటు హైడ్రా సిబ్బంది బుల్కాపూర్ నాలాను శుభ్రం చేశారు.…