‘ఖిలాడీ’, ‘రామబాణం’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ డింపుల్ హయతి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. తన ఇంట్లో పనిచేస్తున్న ఇద్దరు కార్మికులను జీతం ఇవ్వకుండా ఉన్నపళంగా బయటకు గెంటేశారని ఆమెపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. డింపుల్ హయతి ఇంట్లో ఒడిస్సాకు చెందిన ఇద్దరు యువకులు కొంతకాలంగా పనిచేస్తున్నారు. అయితే, వారికి చెప్పాపెట్టకుండా, ఇవ్వాల్సిన జీతం డబ్బులు కూడా ఇవ్వకుండా వారిని హఠాత్తుగా పనిలోంచి తీసేసి బయటకు పంపించారని బాధితులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని…