Bathukamma Guinness Record: రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సరూర్‌నగర్ మైదానంలో నిర్వహించిన బతుకమ్మ కార్యక్రమం రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డులు సాధించింది. గిన్నిస్ రికార్డు సాధనే లక్ష్యంగా సరూర్‌నగర్ స్టేడియంలో సోమవారం బతుకమ్మ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా 63 అడుగుల భారీ బతుకమ్మ ఏర్పాటు చేశారు. ఒకేసారి 1354 మంది మహిళలతో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. మన తెలంగాణ బతుకమ్మ రెండు విభాగాల్లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో స్థానం సంపాదించుకుంది. అతిపెద్ద బతుకమ్మగా, అతిపెద్ద జానపద…