గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్ర హోం శాఖ స్పెషల్ సీఎస్ CV ఆనంద్ పై నందమూరి బాలకృష్ణ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ హీరోకు క్షమాపణలు చెప్పాలని CV ఆనంద్ ను ట్యాగ్ చేస్తూ ఎక్స్ లో ట్వీట్స్ చేస్తున్నారు. వివరాల్లోకెళితే.. గత నెలలో తెలుగు సినిమా పరిశ్రమలోని అగ్ర హీరోలు, నిర్మాతలు, దర్శకులు, డిజిటల్ మూవీ కంపెనీలను, మూవీ పైరసీ ముఠాలను అరికట్టేందుకు హైదరాబాద్ నగర పోలీసు సైబర్ క్రైమ్ బృందంతో ముఖ్యమైన…