ఈ విజయం ప్రజలది.. వారికి నేను ఋణపడి ఉంటానన్నారు హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఈటల రాజేందర్.. తన విజయం తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. డబ్బు సంచులను, మద్యం సీసాలకు హుజురాబాద్ ఓటర్లు పాతరేశారన్నారు.. చిన్నచిన్న ఉద్యోగస్తులను కూడా అధికార పార్టీ వేధింపులకు గురిచేసిందని విమర్శించిన ఆయన.. 75 సంవత్సరాల చరిత్రలో ఇలాంటి ఎన్నికలు ఎక్కడ జరగలేదన్నారు.. నా గెలుపునకు కృషి చేసిన కేంద్ర, రాష్ట్ర నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు.. ఇక, ముఖ్యమంత్రి…
హుజురాబాద్ శాసనసభ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ భారీ మెజారిటీతో విజయం సాధించారు.. గతంలో టీఆర్ఎస్ పార్టీ నుంచి వరుసగా విజయాలు సాధించిన ఈటల.. ఈ సారి బీజేపీ నుంచి బరిలోకి దిగి మరోసారి గెలుపొందారు. రాజేందర్ 2021 జూన్‌లో టీఆర్ఎస్ పార్టీకి, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా ఇవ్వడంతో హుజూరాబాద్‌లో ఉప ఎన్నికలు అనివార్యం అయిన సంగతి తెలిసిందే.. ప్రత్యేక పరిస్థితుల్లో జరిగిన ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో విక్టరీ కొట్టారు. అయితే,…
హుజురాబాద్ నియోజక వర్గం లో ఒక్క మహిళ భవనం ఒక్క డబుల్ బెడ్ కట్టలేదు. కానీ ధరలు పెంచిన ఆ బీజేపీకి ఎందుకు ఓటు వేయాలని అడిగారు మంత్రి హరీష్ రావు. హుజూరాబాద్ కు వచ్చి అభివృద్ది పనులతో పాటు కమ్యూనిటీ హల్ లు ఇచ్చిన. హుజూరాబాద్ లో పార్టీ కార్యకర్తగా రాష్ట్ర మంత్రిగా పని చేస్తున్న. ఈటల రాజేందర్ ప్రలోభాలకు గురి చేస్తే తప్పు లేదు కానీ నేను హుజూరాబాద్ లో అభివృద్ది చేస్తే తప్ప…
కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఏర్పాటు చేసిన రెడ్డి ఆత్మీయ సమావేశంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. అక్కడ ఆయన మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కేసిఆర్ రెడ్డి కమ్యూనిటీ హాల్ కు కోటి రూపాయలు కేటాయించారు. సీఎం కేసీఆర్ అన్ని సామాజీక వర్గాలకు న్యాయం చేస్తున్నారు. ఆపదలో ఉన్న పేదలను ఆదుకునే వర్గం రెడ్డి సామాజిక వర్గం. అన్ని సామాజిక వర్గాలకు ఆత్మీయతను పంచుతున్న వర్గం రెడ్డి వర్గం. రెడ్డి సామాజిక వర్గంలో పుట్టిన ప్రతి బిడ్డ వ్యవసాయం…
సాధారణంగా ఎన్నికలు వస్తున్నాయంటే నేతలకు గుబులు పుడుతుంది. కానీ ఓటర్లకు మాత్రం పండగే. ముఖ్యంగా మందుబాబులకు. నామినేషన్ వేసింది మొదలు పోలింగ్ వరకు తాగినోడికి తాగినంత. రోజంతా మత్తులోనే. ఎవరిని పలకరించినా మాటలు మత్తు మత్తుగా వస్తాయి. ఊళ్లలో మద్యం ఏరులై పారుతుంది. ఉప ఎన్నికలు జరుగుతున్న హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పుడు అదే జరుగుతోంది. ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ కూడా రాలేదు. కానీ ఎక్కడ చూసినా పండగ వాతావరణమే. ఎన్నికలు ఎప్పుడైనా పెట్టనీ అప్పటి వరకు…
హుజురాబాద్ నియోజకవర్గంలో తెరాసలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. కమలాపూర్ మండలం దేశరాజుపల్లి గ్రామం నుండి వివిధ పార్టీలకు చెందిన 100మందికి పైగా నాయకులు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో తెరాసలో చేరారు. కేసీఆర్ గారు చేస్తున్న అభివృద్ధిలో భాగస్వాములవ్వాలనే తెరాసలో చేరుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ… దళితబంధు పథకంపై కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రజలు ఎవరు అలాంటి దుష్ప్రచారాలను నమ్మవద్దు. బీజేపీ పార్టీ వాళ్ళు దళితబంధు ఆపాలని కుట్రలు…