తెలంగాణలోని హుజూరాబాద్ లో తప్ప రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ కూడా ఎలాంటి ఎన్నికలు లేవు. ఈ ఒక్క ఉప ఎన్నికనే రాబోయే సార్వత్రిక ఎన్నికలను డిసైడ్ చేయనుందని ప్రచారం జరుగుతోంది. దీంతో గతంలో ఎన్నడూ లేనివిధంగా హుజూరాబాద్ లో రాజకీయవేడి రాజుకుంది. ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఉప ఎన్నిక నోటిఫికేషన్ రాకముందే ఇక్కడ అన్ని పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. త్వరలోనే ఉప ఎన్నిక షెడ్యూల్ వస్తుందని అందరూ…