Dowry Harassment: కర్ణాటక రాష్ట్రంలోని బెళగావిలోని కమల్దిన్ని గ్రామంలో దారుణం జరిగింది. పెళ్లైన నాలుగు నెలలకే ఓ వివాహితను కిరాతకంగా హత్యకు గురైంది. మృతురాలిని సాక్షిగా గుర్తించిన పోలీసులు.. ఆమె భర్త ఆకాశ్ కాంబర్ హత్య చేసి పరారై ఉంటాడని అనుమానిస్తున్నారు.
Hyderabad: హైదరాబాద్ లోని శేరిలింగంపల్లి ప్రాంతంలో మానవత్వాన్ని కలచివేసే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. నడిరోడ్డుపై గర్భవతిగా ఉన్న భార్యను భర్తే బండరాయితో పలుమార్లు కొట్టి హత్యకు యత్నించిన ఘటన స్థానికులను ఒక్కసారిగా షాక్‌కు గురిచేసింది. ఈ ఘటన శేరిలింగంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే వికారాబాద్‌కు చెందిన ఎండీ బస్రత్ (32), షబానా పర్వీన్ (22) దంపతులు హఫీజ్‌పేట్ ఆదిత్యనగర్‌లో నివసిస్తున్నారు. ప్రస్తుతం షబానా రెండు నెలల గర్భిణి.…
మీర్‌పేట్ మాధవి హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది.. డీఎన్‌ఏ రిపోర్టు పోలీసుల వద్దకు చేరుకుంది.. మాధవిని తన భర్త హత్య చేసి ముక్కలుగా నరికి.. ఉడకబెట్టి ఎముకలను పొడిగా చేసి చెరువులో పారేసినట్లు తేలింది. భర్త, మాజీ ఆర్మీ అధికారి గురుమూర్తి ఎలాంటి ఆధారాలు లేకుండా జాగ్రత్తపడ్డాడు. ఇంట్లో దొరికిన టిష్యూస్ ఆధారంగా ఈ కేసులో పోలీసులు గురుమూర్తిని అరెస్ట్ చేశారు. క్లుస్ టీం ఇచ్చిన టిష్యూస్ ని డీఎన్ఏ కోసం పంపారు.
Divorce: రోజూ గొడవలతో విసిగిపోయిన భార్య భర్తను వదిలేసింది. ఆ తర్వాత ఆమె వేరే పెళ్లి చేసుకుంది. అయితే ఆరేళ్లు గడిచినా భర్త మనసులో నుంచి ఈ ఫీలింగ్ పోలేదు.