Divorce: రోజూ గొడవలతో విసిగిపోయిన భార్య భర్తను వదిలేసింది. ఆ తర్వాత ఆమె వేరే పెళ్లి చేసుకుంది. అయితే ఆరేళ్లు గడిచినా భర్త మనసులో నుంచి ఈ ఫీలింగ్ పోలేదు. అసలు తననెందుకు వదిలేసిందో తెల్సుకోవాలనుకున్నాడు. భార్య గుట్టు బయటకు తీయాలని నిర్ణయించుకుని ఆరేళ్లు ఓపిక పట్టాడు.
Read Also: US Dentist Crime: క్లూ లేకుండా భార్యని చంపాడు.. కానీ చివరికి అలా బుక్కయ్యాడు
రోజూ గొడవలతో విసిగిపోయిన భార్య భర్తను వదిలేసి వేరే పెళ్లి చేసుకుంది. అయితే ఆగ్రహించిన భర్త ఆరేళ్ల తర్వాత భార్యపై పగ పెంచుకున్నాడు. మద్యం మత్తులో భార్య ఇంటికి చేరిన అతడు ఆమెను దారుణంగా హత్య చేశాడు. ఇది మాత్రమే కాదు, ఆమె రెండున్నరేళ్ల కొడుకును కత్తితో పదే పదే పొడిచాడు. ఈ దారుణ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులోని హెనూర్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. షేక్ సోహైల్ మద్యం మత్తులో విడిపోయిన భార్యతో గొడవకు దిగాడు. గొడవ తీవ్రస్థాయికి చేరడంతో కోపంలో నిందితుడు ఆమెను హత్య చేశాడు. ఆ తర్వాత రెండున్నరేళ్ల బాలుడిపై దాడి చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడి పేరు షేక్ సోహైల్ కాగా, పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది.
Read Also: పుట్టగొడుగులతో పుట్టెడు లాభాలు.. ఆ ప్రయోజనాలేంటో తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు..
ఈ ఘటనపై స్థానిక పోలీసులు తదుపరి విచారణ ప్రారంభించారు. నిందితుడు సోహైల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని లోతుగా విచారిస్తున్నారు. హత్యకు గల ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. అయితే వీరిద్దరి మధ్య లేని వైవాహిక బంధమే ఇందుకు కారణం అనే అవకాశాలు బలంగా ఉన్నాయి.