తిరుమల శ్రీవారిని ఇవాళ ఉదయం టీడీపీ అధినేత చంద్రబాబు దంపతులు దర్శించుకున్నారు. ఆయనకు అర్చకులు వేద ఆశీర్వాచనం అందజేసి ప్రసాదం అందించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. వేంకటేశ్వర స్వామి పాదాల చెంత పుట్టిన నేను.. అంచెలంచెలుగా ఏదుగుతూ వచ్చాను అని ఆయన పేర్కొన్నారు. తిరుమలలో భక్తుల రద్దీ కొంత తక్కువగా కొనసాగుతుంది. క్యూ కాంప్లెక్స్‌లో 5 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉంన్నారు.
Tirumala: రుమలలో సరికొత్త రికార్డుల దిశగా శ్రీవారి హుండీ ఆదాయం సాగుతోంది. ఈ వార్షిక ఏడాదిలో రూ.వెయ్యి కోట్ల హుండీ ఆదాయాన్ని టీటీడీ అంచనా వేయగా.. కేవలం 8 నెలల కాలంలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.1161.74 కోట్లు నమోదైంది. 8 నెలలుగా ప్రతి నెలా తిరుమల వెంకటేశుడి హుండీ ఆదాయం రూ.100 కోట్ల మార్క్ దాటుతోంది. తాజాగా వరుసగా 9వ నెల కూడా రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం రూ.100 కోట్ల మార్క్ దాటడం విశేషం.…
Sabarimala: కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల భక్తులతో కిటకిటలాడుతోంది. మండల, మకరవిలక్కు పూజల కోసం ఈనెల 16 నుంచి శబరిమల అయ్యప్పస్వామి దర్శనాలు ప్రారంభం కావడంతో భక్తులు భారీగా తరలివెళ్తున్నారు. ఈ క్రమంలో కేవలం 10 రోజుల్లోనే రూ.52 కోట్ల ఆదాయం సమకూరినట్లు ట్రావెన్ కోర్ దేవస్థానం ప్రకటించింది. అత్యధికంగా అరవణ ప్రసాదం విక్రయంతో రూ.23.57 కోట్లు, హుండీల ద్వారా రూ.12.73 కోట్లు, అప్పం అమ్మకాల ద్వారా రూ.2.58 కోట్లు వచ్చిందని దేవస్థానం వెల్లడించింది. గత ఏడాది…
Shirdi: ఏపీలోని తిరుమల తర్వాత దేశంలో హుండీ ఆదాయం అధికంగా ఉన్న ఆలయం మహారాష్ట్రలోని షిర్డీ మాత్రమే. కరోనా తర్వాత ఆంక్షలు సడలించడంతో షిర్డీ సాయినాథుడిని దర్శనం చేసుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో షిర్డీ సాయినాథునికి రికార్డు స్థాయిలో హుండీ కానుకలు వచ్చి చేరుతున్నాయి. గత ఏడాది అక్టోబర్ నుండి ఈ నవంబర్ వరకు బాబా సంస్థాన్‌కు రూ.398 కోట్ల కానుకలు వచ్చాయి. ఈ విషయాన్ని సాయి సంస్థాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ భాగ్యశ్రీ బనాయత్ వెల్లడించారు.…
గతంలో ఎన్నడూ లేనివిధంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో స్వామి వారి హుండీ ఆదాయం భారీగా పెరిగింది. మే నెలలో రికార్డు స్థాయిలో 130 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఒక్క నెలలోనే ఇంత భారీ స్థాయిలో ఆదాయం రావడం ఇదే మొదటిసారి. మే నెలలో 22లక్షల 62వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఎన్నడూ లేనివిధంగా చరిత్రలో తొలిసారి ఒక్క నెలలో స్వామి వారి హుండీ ఆదాయం భారీగా…
కరోనా తర్వాత సాధారణ పరిస్థితులు నెలకొనడంతో తిరుమలలో శ్రీవారి హుండీకి భారీగా ఆదాయం సమకూరుతోంది. ఈ ఏడాది మార్చి నుంచి ప్రతి నెలా రూ.100 కోట్లకు పైగానే టీటీడీకి శ్రీవారి హుండీ ద్వారా ఆదాయం వచ్చి చేరుతోంది. మే నెలలో తిరుమల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూ.129.93 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. జూన్ నెల పూర్తి కాకుండానే రూ.100 కోట్ల మార్కును దాటిందని.. జూన్ 1 నుంచి 26 వరకు రూ.106…
కలియుగ వైకుంఠం తిరుమలకు భక్తుల తాకిడి పెరుగుతోంది. కరోనా నుంచి దేశం కోలుకుంటోంది. దీంతో స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చేవారు పెరుగుతున్నారు. కొండపై వీఐపీలు, మంత్రులు, ఎమ్మెల్యేల తాకిడి కూడా ఎక్కువగానే వుంది. నవంబర్ 13,14,15వ తేదీలలో శ్రీవారి ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. 14వ తేదీన తిరుపతిలో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సు జరుగుతోంది. ఈ సదస్సుకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా వస్తున్నారు. వీఐపీల తాకిడి కారణంగా బ్రేక్ దర్శనాలు, సిఫార్సు…