‘ ది కాశ్మీర్ ఫైల్స్’ దేశంలో ఎంతో సంచలనం కలిగించింది. 1990ల్లో కాశ్మీర్ లో ముష్కరులు, కాశ్మీరీ హిందువులు, పండితులపై కొసాగించిన మారణహోమాన్ని కళ్లకు కట్టినట్లు చూపించాడు డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి. ఈ సినిమాకు బీజేపీ పాలిత రాష్ట్రాలు పన్నులు మినహాయించడం, అధికారులకు సినిమా చూసేందుకు సెలవులు కూడా ఇవ్వడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాతో పాటు పలువురు బీజేపీ నాయకులు ఈ సినిమాను మెచ్చుకున్నారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం…