‘ ది కాశ్మీర్ ఫైల్స్’ దేశంలో ఎంతో సంచలనం కలిగించింది. 1990ల్లో కాశ్మీర్ లో ముష్కరులు, కాశ్మీరీ హిందువులు, పండితులపై కొసాగించిన మారణహోమాన్ని కళ్లకు కట్టినట్లు చూపించాడు డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి. ఈ సినిమాకు బీజేపీ పాలిత రాష్ట్రాలు పన్నులు మినహాయించడం, అధికారులకు సినిమా చూసేందుకు సెలవులు కూడా ఇవ్వడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాతో పాటు పలువురు బీజేపీ నాయకులు ఈ సినిమాను మెచ్చుకున్నారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం దేశాన్ని విభజించే కుట్రలో భాగంగానే ఈ సినిమాను నిర్మించారని విమర్శించారు.
ఇదిలా ఉంటే వివేక్ అగ్నిహెత్రి, ఆయన భార్య పల్లవి జోషిలు ప్రపంచ వ్యాప్తంగా ‘ హ్యూమానిటీ టూర్’ లో పర్యటిస్తున్నారు. ఇటీవల వివేక్ అగ్నిహోత్రి యూకే పార్లమెంట్ లోని పలువురు నేతలకు ఈ సినిమా చూపించారు. కాశ్మీర్ లో జరిగిన మరణహోమాన్ని చూపించడంతో పాటు మానవత్వం కోసం ఆయన చేసిన కృషిని యూకే పార్లమెంటేరియన్లు ప్రశంసించారు.
శామ్ తారీ (ఎంపి లేబర్ పార్టీ), థెరిసా విలియర్స్ ఎంపి (కన్సర్వేటివ్ పార్టీ), లార్డ్ నవనిత్ ధోలాకియా (లిబరల్ డెమొక్రాట్), వీరేంద్ర శర్మ ఎంపి (లేబర్ పార్టీ), నవేందు మిశ్రా ఎంపి (లేబర్ పార్టీ) సహా పలువురు నేతలు సినిమాపై మాట్లాడారు. సినిమాపై వాళ్ల అభిప్రాయాలను పంచుకున్నారు. డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రిపై ప్రశంసలు కురిపించారు.
వివేక్ అగ్నిహెత్రి దంపతులు హ్యుమానిటీ టూర్ లో భాగంగా యూకేలోని నెహ్రూ సెంటర్ లండన్, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం, ఇంపీరియల్ కళాశాల, ఎడిన్‌బర్గ్, లయన్స్ క్లబ్ బర్మింగ్‌హామ్, స్కాటిష్ జ్యూయిష్ హెరిటేజ్ సెంటర్, స్కాట్లాండ్, గ్లాస్గో స్కాట్లాండ్, యునైటెడ్ కింగ్‌డమ్ పార్లమెంట్, హౌస్ ఆఫ్ లార్డ్స్, యుకె స్పీకర్స్ కార్నర్‌లో మాట్లాడారు. సినిమా గురించి వివరించారు.
#WATCH
This is what Members of @UKParliament (MPs) have to say about Hindu Genocide in Kashmir.The impact of a small film with TRUTH. #HumanityTour pic.twitter.com/UvVmnzDk3C
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) June 24, 2022