కర్ణాటకలోని హుబ్లీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఓ వాట్సాప్ స్టేటస్ కారణంగా అర్ధరాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఓల్డ్ హుబ్లీ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా అభ్యంతరకర రీతిలో వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు స్పందించకపోవడంతో అల్లరి మూకలు ఏకంగా పోలీస్ స్టేషన్‌పై రాళ్ల దాడికి పాల్పడ్డాయి. ఈ సమయంలో ఇన్‌స్పెక్టర్ సహా పోలీసులు అక్కడే ఉన్నారు. వారు ఆందోళనకారులను వారించే ప్రయత్నం చేసినా…