పారిస్ ఒలింపిక్స్ లో అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది. శుక్రవారం జరిగిన పారిస్ ఒలింపిక్స్‌లో చైనా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి హువాంగ్ యా కియోంగ్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. అయితే, తన ఆనందం దానికే పరిమితం కాలేదు. స్వర్ణం గెలిచిన వెంటనే తోటి ఆటగాడు ఆమెకు ప్రపోజ్ చేశాడు. డబుల్స్ ప్లేయర్ యుచెన్ మెకాళ్లపై కూర్చుని ఉంగరంతో ఆమెకు లవ్ ప్రపోజ్ చేశాడు. దీంతో.. హువాంగ్ ఆశ్చర్యం, ఆనందంతో ఓకే చెప్పింది. పారిస్ ఒలింపిక్స్‌లో లవ్ ప్రపోజల్ ఇదే…