మధ్యప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వర్షాలు కారణంగా పలు ఇళ్లు నీటిలో నానిపోయాయి. దీంతో ఒక ఇల్లు కూలిపోయింది. ఈ ఘటనలో శిథిలాల కింద చిక్కుకుని ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.
నంద్యాల జిల్లాలో విషాదం నెలకొంది. చాగలమర్రి మండలం చిన్నవంగలిలో ఇల్లు కూలి ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందారు. ఆ కుటుంబం గాఢ నిద్రలో ఉన్న సమయంలో.. అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.. ఈ ప్రమాదంలో భార్య, భర్త, ఇద్దరు పిల్లలు మృతి చెందారు.
గుజరాత్‌లో గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు నివాసాలు నీళ్లలో మునిగి ఉన్నాయి. ఇక భారీ వర్షాల కారణంగా మంగళవారం గుజరాత్‌లోని ద్వారకలోని ఖంభాలియా తాలూకాలో మూడు అంతస్తుల ఇల్లు కూలిపోయింది.