Shai Hope Breaks Virat Kohli Record With Latest Century: రెండో వన్డేలో భారత్ చేతిలో వెస్టిండీస్ ఓటమి చవిచూసిన సంగతి పక్కనపెట్టేస్తే.. సెంచరీతో చెలరేగిన విండీస్ బ్యాట్స్మన్ షై హోప్‌పై మాత్రం సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ, సొగసైన షాట్లతో సునాయాసంగా శతకం బాదాడు. 135 బంతులాడిన ఇతను 8 ఫోర్లు, మూడు సిక్స్‌ల సహాయంతో 115 పరుగులు చేశాడు. తన వందో వన్డే మ్యాచ్‌లో అతడు సెంచరీ చేయడం…