Asia Cup: ఆసియా కప్‌లో తొలి మ్యాచ్‌లో దాయాది పాకిస్థాన్‌పై అదరగొట్టిన టీమిండియా రెండో మ్యాచ్‌లో బుధవారం నాడు హాంకాంగ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో హాట్ ఫేవరేట్ టీమిండియానే అయినా హాంకాంగ్‌ను తక్కువ అంచనా వేస్తే పప్పులో కాలేసినట్లే అవుతుంది. గ్రూప్-బిలో ఆప్ఘనిస్తాన్ అదరగొట్టే రీతిలో శ్రీలంక, బంగ్లాదేశ్‌లపై గెలిచి గ్రూప్ టాపర్‌గా నిలిచింది. అదే విధంగా గ్రూప్-ఎలో హాంకాంగ్ సంచలనాలు నమోదు చేయాలని ఆరాటపడుతోంది. గతంలో ఆసియా కప్‌లో 2008లో, 2018లో హాంకాంగ్‌తో ఇండియా తలపడింది.…
ప్రపంచంలో వజ్రాలు ఎంతో విలువైనవి. మామూలు వజ్రాలు సైతం లక్షల రూపాయల్లో ఉంటాయి. ఇక అరుదైన వజ్రాల సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. అరుదైన వజ్రాలు కోట్ల రూపాయల్లో ఉంటాయి. ఇటీవలే హాంకాంగ్‌లో ఓ పింక్ వజ్రాన్ని వేలం వేశారు. ది సకురా పేరుతో ఉన్న ఈ వజ్రం బరువు 15.8 క్యారెట్లు ఉంది. అరుదైన ఈ పింక్ వజ్రం 29.3 మిలియన్ డాలర్లకు అమ్ముడుపోయింది. ఈ విషయాన్ని ఆక్షన్.హౌస్ తెలియజేసింది. ఈ పింక్ వజ్రానికి ప్లాటినం,…
కరోనా ఎంట్రీతో అన్ని దేశాలు ఆంక్షల బాట పట్టాయి.. ఇతర ప్రాంతాలు, దేశాల నుంచి ఎవరైనా వచ్చారంటే.. అనుమానంగా చూడాల్సిన పరిస్థితి.. అయితే, క్రమంగా ఆ పరిస్థితి పోయినా.. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఎంట్రీతో మరోసారి చాలా దేశాలు కఠిన ఆంక్షలు విధించాయి.. అయితే, ఈ సమయంలో విదేశీ ప్రయాణికులకు హాంగ్ కాంగ్ శుభవార్త చెప్పింది.. హాంగ్ కాంగ్‌కు వచ్చే ప్రయాణికులు ఇకపై 21 రోజులపాటు క్వారంటైన్‌లో ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.. Read…
దేశంలో కరోనా కేసులు, మరణాల సంఖ్య తగ్గుముఖం పడుతున్నాయని సంతోషించే సమయంలో కేంద్రం మరో బాంబు పేల్చింది. ధక్షిణాఫ్రికాలో బి.1.1.529 అనే కొత్త వేరియంట్‌ను గుర్తించారని, కొత్త వేరియంట్ పట్ల అప్రమత్తంగా ఉండాలని చెబుతూ కేంద్రం హైఅలర్ట్ ప్రకటించింది. అన్ని రాష్ట్రప్రభుత్వాలకు కేంద్రం లేఖ రాసింది. ఇక విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు మూడంచెల పద్దతిలో స్క్రీనింగ్ చేయాలని కేంద్రం ఆదేశించింది. విదేశాల నుంచి వచ్చేవారి పట్ల అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా దక్షిణాఫ్రికా, హాంకాంగ్ నుంచి…
తులం బంగారం కొనుగోలు చేయాలంటే బోలెడు డబ్బులు పోయాలి. బంగారం ఆభరణాల రూపంలోనే కాదు, తినే వస్తువులుగా కూడా మార్చుకోవచ్చు. వీటిని ఇడబుల్ గోల్డ్ అని పిలుస్తారు. 24 క్యారెట్ల ఇడబుల్ గోల్డ్‌ను పేపర్‌లా మార్చి తినేందుకు వినియోగిస్తుంటారు. ఈ ఇడబుల్ గోల్డ్ తో ఐస్‌క్రీమ్‌ను కూడా తయారు చేయవచ్చట. ఈ 24 క్యారెట్ల ఐస్‌క్రీమ్ కావాలి అంటే హాంకాంగ్ వరకు వెళ్లాల్సిందే. ఐస్‌క్రీమ్ పైన 24 క్యారెట్ల స్వచ్ఛత కలిగిన పలుచని పేపర్ ను…
చైనా ప్రతి దేశంలో కయ్యానికి కాలు దువ్వుతున్న సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారి అపవాదును తొలగించుకునేందుకు, ఆ విషయాలను పక్కదోవ పట్టించేందుకు చైనా ఈ విధంగా ప్రవర్తిస్తున్నట్టు నిపుణులు చెబుతున్నారు. సరిహద్దుల్లో ఉన్నదేశాలతో నిత్యం పేచీ పెట్టుకుంటున్న డ్రాగన్, తైవాన్ విషయంలో చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీంగా టెన్షన్ పెడుతున్నాయి. ఇప్పటికే హాంకాంగ్ ను తన గుప్పిట్లో పెట్టుకున్న చైనా, తైవాన్ దేశాన్ని కూడా తన ఆదీనంలోకి తీసుకుంటానని అంటోంది. టిబెట్ విషయంలో కూడా ఇదే దూకుడును ప్రదర్శించి…
మెట్రో రైల్లో అప్పుడప్పుడు మనుషులతో పాటుగా జంతువులు కూడా ప్రయాణం చేస్తుంటాయి. అనుకోని అతిధుల్లా రైల్లోకి వచ్చి, బోగీలన్ని విజిటింగ్ చేస్తు స్టేషన్ రాగానే దిగిపోతుంటాయి. ఇలాంటి ఘటనలు మనదగ్గర చాలా రేర్‌గా జరిగినా, హాంకాంగ్ మెట్రో రైల్లో ఇవి సాధారణమే. హాంకాంగ్‌లోని క్వారీబే మెట్రోస్టేషన్‌లోకి సమీపంలోని అడవిలోనుంచి ఓ అడవి పంది వచ్చింది. టక్కెట్ కౌంటర్ సందులో నుంచి లోనికి ప్రవేశించిన ఆ అడవి పంది రైలు ఎక్కేసింది. బోగీలన్నీ దర్జాగా తిరిగింది. ఓ సీటు…
కరోనాకు చెక్ పెట్టేందుకు పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. చాలా దేశాల్లో వ్యాక్సిన్ తీసుకోవడానికి ప్రజలు ముందుకు రావడంలేదు. దీంతో వ్యాక్సిన్ వేయడం ఇప్పుడు కొన్ని దేశాలకు సవాల్‌గా మారింది. ముఖ్యంగా హాంకాంగ్‌లో ఈ సమస్య అధికంగా ఉన్నది. కావాల్సినన్ని వ్యాక్సిన్లు ఉన్నప్పటికీ తీసుకునేందుకు ప్రజలు ముందుకు రావడంలేదు. దీంతో అధికారులు, వ్యాపాదవేత్తలు, సామాజికవేత్తలు వ్యాక్సినేషన్ కోసం భారీ బహుమతులు ప్రకటిస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకుంటే బంగారు కడ్డీలు ఇస్తామని, మిలియన్ డాలర్ల నగదును అందజేస్తామని ప్రకతిస్తున్నారు.…