హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) భారతదేశంలో కొత్త 2025 డియో 125 ను విడుదల చేసింది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 96,749గా కంపెనీ ప్రకటించింది. యువతను దృష్టిలో ఉంచుకుని ఈ స్కూటర్‌ను సరికొత్తగా తయారు చేసినట్లు కంపెనీ పేర్కొంది. ఈ కొత్త డియో 125 అద్భుతమైన డిజైన్, సరికొత్త ఫీచర్లతో మెరుగైన సామర్థ్యం కలిగి ఉంది. ఈ కొత్త బండి స్పోర్టి, స్టైలిష్ మోటో-స్కూటర్‌గా ఆకర్షణీయంగా ఉంటుంది.