ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం జి.కొత్తపల్లిలో వైసిపి నేత గంజి ప్రసాద్ హత్య రాష్ట్రంలో కలకలం రేపింది. అధికారపార్టీలో ఆధిపత్యపోరు చర్చకు వచ్చింది. నిందితులను వదిలిపెట్టేది లేదని హోంమంత్రి తానేటి వనిత ప్రకటించినా.. క్షేత్రస్థాయిలో పోలీసుల పనితీరుకు మంత్రి స్టేట్‌మెంట్‌కు పొంతన ఉండటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిందితులను అరెస్ట్ చేసినా.. రాజకీయ ఒత్తిళ్లతో విచారణ ముందుకెళ్లడం లేదని పార్టీలోని ఒక వర్గం ఆరోపిస్తోంది. దానికితోడు నిందితులతో పోలీసులు వ్యవహరిస్తున్న తీరును ప్రశ్నిస్తున్నారు నాయకులు. రిమాండ్‌లో ఉన్న…
జిల్లా పేరు మార్పు కోనసీమ జిల్లాలో విధ్వంసం సృష్టించింది… తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైంది.. ఈ ఘటనపై ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య విమర్శల పర్వం కొనసాగుతోంది.. తప్పు మీదంటే.. మీదేనంటూ దూషించుకుంటున్నారు నేతలు.. అయితే, ఈ ఘటనపై ఎన్టీవీతో మాట్లాడిన హోం మంత్రి తానేటి వనిత.. అసలు కోనసీమ విధ్వంసం ఊహించ లేదు, హఠాత్తుగా జరిగిందని పేర్కొన్నారు. అంబేద్కర్ పేరు పెట్టకపోతే జనసేన నాయకుడు ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది వాస్తవం కాదా? అని ప్రశ్నించిన ఆమె.. ధర్నాలు, నిరాహార…
మంత్రి గారూ…ఏమిటిది అని ప్రశ్నిస్తున్నారు..ఇంతకంటే పెద్దఘటనేం కావాలి.. స్పందించటానికైనా, పరామర్శించటానికైనా… అంటున్నారు..సంబంధం ఉన్నవారు లేని వారిలో కూడా కదలిక వచ్చింది కానీ, స్వయంగా ఆ శాఖ మంత్రి మాత్రం సైలెంట్ గా ఉన్నారనే విమర్శలు పెరుగుతున్నాయట. పోరస్ కంపెనీ అగ్ని ప్రమాదం తో రాష్ట్రం మొత్తం ఉలిక్కి పడింది. నాటి ఎల్జీ పాలిమర్స్ సంఘటనను గుర్తుకు తెచ్చేలా అగ్ని ప్రమాదం జరగడంతో అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దీనిపై అధికార యంత్రాంగం.. ప్రభుత్వంలోని పెద్దలు వెంటనే స్పందించారు. చాలా…