వడ దెబ్బతో మృతి చెందినవారి కుటుంబానికి రూ.4 లక్షల పరిహారం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించినట్టు హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత... తాడేపల్లిలోని విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయంలో హోంమంత్రి అనిత సమీక్ష నిర్వహించారు.. వడగాల్పులు, రాబోయే వర్షాకాలానికి సంసిద్ధతపై చర్చించారు.. ఈ సమీక్షలో హోం, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత.. వాతావరణ మార్పులకు తగ్గట్లు అధికార యంత్రాంగం సంసిద్ధంగా ఉండాలని తెలిపారు.
శ్రీకాకుళానికి చెందిన క్యాన్సర్ పెషేంట్ తో హోం మంత్రి అనిత విడియో కాల్ మాట్లాడారు. ఎనిమిది సంవత్సరాలుగా క్యాన్సర్ తో పోరాడుతున్న లతశ్రీకి ధైర్యం చెప్పారు. మంత్రి అనిత మాట్లాడుతూ.. ధైర్యాన్ని మించిన మెడిసిన్ ఏదీ లేదన్నారు. లతశ్రీని బాధపడొద్దని.. పిల్లలున్నారని.. మీకు మేమంతా అండగా ఉంటామని మంత్రి అనిత చెప్పారు. పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నవారు కూడా ధైర్యంగా ఎదుర్కొని ఆరోగ్యంగా ఉంటున్నారు. మీరు కూడా ధైర్యాన్ని కోల్పోవద్దని సూచించారు. కుటుంబ సభ్యులు అండగా…
శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరు నల్లబొమ్మనిపల్లిలో అత్తాకోడలిపై అత్యాచార ఘటనపై హోం మంత్రి అనిత సీరియస్ అయ్యారు. అత్యారానికి పాల్పడిన దుండగులను సత్వరమే అరెస్ట్ చేయాలని ఆదేశించారు.
విధి నిర్వహణలో మృతి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ చంద్రానాయక్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రకటించారు ఏపీ హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత.. సీఎం చంద్రబాబు నాయుడు బందోబస్తు విధులకోసం వచ్చిన.. ఏఆర్ కానిస్టేబుల్ చంద్రా నాయక్ గుండెపోటుతో మృతి చెందడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.. సహచరులు ఎంతో శ్రమించి సీపీఆర్ చేసి కాపాడాలని ప్రయత్నించినా ఏఆర్ కానిస్టేబుల్ చంద్రానాయక్ (పీసీ 3570) అకాలమరణం చెందడం అత్యంత విషాదకరం అన్నారు..