SONY-TCL: హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీలు సోనీ (SONY), టిసిఎల్ (TCL) భాగస్వామ్యం దిశగా ముందడుగు వేశాయి. ఈ మేరకు రెండు కంపెనీలు మెమోరాండం ఆఫ్ అండర్‌స్టాండింగ్ (MoU)పై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం ప్రకారం.. సోనీ హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ వ్యాపారాన్ని నిర్వహించేలా ఒక జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలించనున్నారు. ప్రతిపాదిత నిర్మాణంలో TCLకు 51 శాతం వాటా, సోనీకి 49 శాతం వాటా ఉండనుంది.…