భారతీయ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తున్న చిత్రం ‘మహావతార్ నరసింహా’. కేజీఎఫ్, కాంతార వంటి చిత్రాలను నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో, క్లీమ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ పౌరాణిక యానిమేషన్ మూవీ రూపొందింది. అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూలై 25న సైలెంట్‌గా థియేటర్లలో విడుదలై, మౌత్ టాక్‌తోనే సూపర్ హిట్‌గా దూసుకుపోతోంది. సౌత్, నార్త్ ఆడియెన్స్ ఒకేలా ప్రశంసలు కురిపిస్తున్న ఈ సినిమాకు తాజాగా ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు రివ్యూ ఇచ్చారు.…