Mahavatar Narasimha : మహావతార్ నరసింహా మూవీపై చాగంటి ప్రశంసలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తున్న చిత్రం ‘మహావతార్ నరసింహా’. కేజీఎఫ్, కాంతార వంటి చిత్రాలను నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో, క్లీమ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ పౌరాణిక యానిమేషన్ మూవీ రూపొందింది. అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూలై 25న సైలెంట్‌గా థియేటర్లలో విడుదలై, మౌత్ టాక్‌తోనే సూపర్ హిట్‌గా దూసుకుపోతోంది. సౌత్, నార్త్ ఆడియెన్స్ ఒకేలా ప్రశంసలు కురిపిస్తున్న ఈ సినిమాకు తాజాగా ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు రివ్యూ ఇచ్చారు.
Also Read : Collie : 24 గంటల్లోనే ఊహించని టికెట్ బుకింగ్స్ – రికార్డులు తిరగరాసిన ‘కూలీ’
Also Read
- Theater Plus: ఓటీటీ సబ్స్క్రిప్షన్ అవసరం లేదు.. రూపాయి కట్టకుండానే 3 మలయాళ బ్లాక్ బస్టర్స్ ఫ్రీ!
- Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి 'రామోజీ గ్రూప్'.. 'తెల్ల కాగితం'తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
- Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
- Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
నిర్మాత అలు అరవింద్‌తో కలిసి సినిమా చూసిన ఆయన, థియేటర్‌లో అనుభవించిన భావోద్వేగాలను పంచుకున్నారు.. “భక్త ప్రహ్లాద వంటి చిత్రం ఇప్పటికీ ప్రజల మదిలో నిలిచింది. అదే స్థాయిలో, బొమ్మలతో రూపొందించినప్పటికీ ‘మహావతార్ నరసింహా’లో నిజంగా నరసింహుడిని చూసిన అనుభూతి కలిగింది. ముఖ్యంగా క్లైమాక్స్ చాలా అద్భుతంగా ఉంది. కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా ఇది” అని తెలిపారు. ఈ రివ్యూ వీడియోను గీత ఆర్ట్స్ అధికారిక సోషల్ మీడియా అకౌంట్ నుంచి షేర్ చేయడంతో, ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. చాగంటి తో పాటు శాంతా బయోటిక్ వ్యవస్థాపకులు వరప్రసాద్ రెడ్డి కూడా ఈ చిత్రాన్ని వీక్షించి ప్రశంసలు కురిపించారు.
ఇక కలెక్షన్ల విషయానికి వస్తే, ఊహించని రీతిలో బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది మహావతార్ నరసింహా. కేవలం రూ.40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ యానిమేషన్ మూవీ ఇప్పటివరకు రూ.230 కోట్లకు పైగా వసూళ్లను సాధించి, ఇతర స్టార్ హీరోల సినిమాలు వచ్చినా తన క్రేజ్‌ను తగ్గించకుండానే కలెక్షన్లతో దూసుకుపోతోంది.
Chaganti Koteswara Rao garu and K.I. Vara Prasad Reddy garu share their thoughts on #MahavatarNarsimha, applauding the team for delivering a truly divine experience.
Witness the divine saga at theatres near you. 🔥pic.twitter.com/qtHfd7XsJw
— Geetha Arts (@GeethaArts) August 15, 2025
తాజావార్తలు
-
JioBharat 4G Phone: రూ.299కే JioBharat 4G ఫోన్?.. జియో 10వ యానివర్సరీ ఆఫర్ ఇదే!
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Gautam Gambhir: “ఇదో చెత్త మ్యాచ్.. ఆ రికార్డులు ఎవరికి కావాలి?”.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫైర్..
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Anakapalli: సినిమా డైరెక్ట్ చేయడం కన్నా.. దాన్ని నిర్మించి రిలీజ్ చేయడమే మహా కష్టం! డైరెక్టర్ త్రినాథరావు నక్కిన షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్‌ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్‌ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్‌ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!