కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు హోల్‌కెరె ఆంజనేయ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను రాముడితో పోల్చారు. అంతేకాకుండా.. అయోధ్యలోని రామ మందిరానికి వెళ్లి “బీజేపీ రాముడిని” ఎందుకు పూజించాలని ప్రశ్నించారు. జనవరి 22న అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి హాజరు కావాల్సిందిగా సిద్ధరామయ్యను ఎందుకు ఆహ్వానించలేదని ప్రశ్నించగా ఆంజనేయ మీడియాతో మాట్లాడుతూ.. సిద్ధరామయ్యే మా రాముడు అని అన్నారు. అలాంటప్పుడు అయోధ్యకు వెళ్లి ఆ రాముని పూజించడం ఎందుకు? అని ప్రశ్నించారు. అయోధ్య రాముడు…