అస్సాంలో 10 నెలల చిన్నారిలో 'హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్' (HMPV) ఇన్‌ఫెక్షన్ ఉన్నట్లు గుర్తించారు. అస్సాంలో ఇది మొదటి కేసు. ఈ మేరకు శనివారం అధికారులు సమాచారం అందించారు. దిబ్రూఘర్‌లోని అస్సాం మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో చిన్నారికి చికిత్స అందిస్తున్నామని, ప్రస్తుతం పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు.